కలం, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అటవీ (Chandragiri Forest) ప్రాంతంలో మరోసారి ఏనుగుల సంచారం కలకలం రేపుతోంది. చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో సుమారు 22 ఏనుగులతో కూడిన గుంపు (Elephant Herd) సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కోటకడపల్లి పంచాయతీ పరిధిలోని సిద్ధలగండి చెరువు సమీపంలో ఈ ఏనుగులు ఉన్నాయని వెల్లడించారు. అక్కడి నుంచి వీఆర్ కాలనీ, వేములవాడ, కోటకడపల్లి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయ్యగారిపల్లి, పులిగోనపల్లి, నెరబైలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఏనుగులు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ వీడియోను అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు.
Also Read : సూపర్ స్పీడ్‌తో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుంది: సీఎం
Follow Us On : WhatsApp

