కార్మిక వ్యతిరేక విధానాలపై కదం తొక్కిన నిర్మల్ కార్మికులు

కలం, నిర్మల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా (Workers Rally) తరలివచ్చారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీబీ–జీ రామ్ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధికి అండగా నిలిచే ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. నూతన విద్యుత్, విత్తన విధానాలు రద్దు చేయాలన్నారు.

Also Read : పెద్ది సంస్మరణ సభలో కేటీఆర్ ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>