కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత పరిస్థితులు (Ranchi Students Protest) నెలకున్నాయి. పోటీపరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయని విద్యార్థి, నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి.
దీంతో రాంచీ విధాన సభ వద్దకు విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులను అడ్డుకునేందుకు బారీకేడ్స్ ఏర్పాటు చేశారు. బారీకేడ్స్ తొలగించేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. దీంతో అసెంబ్లీ వద్ద హై టెన్షన్ నెలకొంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనతో రాంచీ మరో జంతర్ మంతర్ గా మారింది.
Also Read : లోక్సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం!
Follow Us On : WhatsApp

