భారత రైతు కిడ్నాప్..! సరిహద్దు దాటి వచ్చి ఎత్తుకెళ్లిన బంగ్లాదేశీయులు

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లా సరిహద్దు సమీపంలోని టీ తోటలో పనిచేస్తున్న ఓ రైతును బంగ్లాదేశ్ కు చెందిన కొందరు కిడ్నాప్ (Indian Farmer Kidnapped) చేసి దేశం దాటించారు. కుకుర్‌జాన్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. తాసర్‌పారా సరిహద్దు గ్రామానికి చెందిన దీపాంకర్‌ గోపే (35) తోట సరిహద్దు కంచె అవతల ఉంది. రైతు తన టీ తోటలో పురుగుమందు పిచికారీ చేస్తుండగా సుమారు 20 మంది బంగ్లాదేశీయులు అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చి అతడిని కిడ్నాప్ చేశారు.

అనంతరం బంగ్లాదేశ్‌లోని పంచగఢ్‌ జిల్లాకు తరలించినట్టు సమాచారం. ఆగస్టు 6న చౌల్‌హటి సరిహద్దు వద్ద ఓ బంగ్లాదేశీయుడు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. కంచెను కోసి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు ప్రతీకారంగానే దీపాంకర్ ను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీపాంకర్ బంధీగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బంగ్లాదేశ్ పౌరుడిని విడిచిపెడితేనే.. దీపాంకర్ ను విడిచిపెడతామని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>