తెలంగాణ స‌ర్కార్ వ‌రుణ‌యాగం ప్రారంభం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎల్ నినో ఎఫెక్ట్‌తో క‌రువు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసి, రైతాంగం, ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌ని ఆశిస్తూ తెలంగాణ స‌ర్కార్ (Telangana Govt) ఆధ్వ‌ర్యంలో వరుణయాగాన్ని (Varuna Yagam) చేప‌ట్టారు. న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున‌సాగ‌ర్‌ విజ‌య్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగ‌ణంలో ఈ యాగం జ‌రుగుతోంది. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దంప‌తులు సోమ‌వారం తెల్ల‌వారుజామున యాగాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాల‌ని, ప్రాజెక్టులు, చెరువులు నిండాల‌ని, పాడిపంటలు సమృద్ధిగా పండాల‌ని మంత్రి ఉత్త‌మ్ ఆశించారు. రైతు సంక్షేమంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని ఆయ‌న ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>