వలిగొండ రోడ్డుపై గుంతల బీభత్సం

కలం, వలిగొండ: వలిగొండ నుంచి భువనగిరికి వెళ్లే ప్రధాన రహదారి (Valigonda- Bhuvanagiri Road) భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. రహదారిపై పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనదారులు అదుపుతప్పి కిందపడటంతో పలువురు గాయాలపాలయ్యారు. అంతేకాకుండా గుంతల్లో పడి వాహనాలు దెబ్బతిన్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు.

ప్రధాన రహదారి దుస్థితిపై వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రాణనష్టం సంభవించకముందే గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>