ప్రజా సమస్యలపై యువజన కాంగ్రెస్ పోరుబాట

కలం, వలిగొండ: కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ (Youth Congress) వెన్నెముక లాంటిదని యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని వరుణ్ గౌడ్ అన్నారు. ఆదివారం వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరుణ్ గౌడ్ మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, సామాన్యుల గొంతుకగా తన పాత్రను క్రియాశీలకంగా నిర్వహిస్తోందని అన్నారు.

ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలోని యువతకు రాజకీయ వేదికను కల్పించడం, వారి హక్కుల కోసం పోరాడటం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యాలని వరుణ్ గౌడ్ పేర్కొన్నారు. యువత రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట గిరీష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మండల అధ్యక్షుడు బత్తిని సహదేవు, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు, పీఏసీఎస్ చైర్మన్ గరిసే రవి, జంగారెడ్డి, బత్తిని లింగయ్య, చెరుకు శివయ్య, పలుసం సతీష్, కొండూరు భాస్కర్, సంజీవ రెడ్డి, కాసుల కొండూరు సాయి, లింగస్వామి, సయ్యద్ బాబా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవేందర్, శ్రీశైలం, నవీన్ యాదవ్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు చేగురి బాలు, ప్రధాన కార్యదర్శులు కొంతం నవీన్, బుగ్గ ఉదయ్, చిన్నపాక నరేందర్, మండల అధ్యక్షుడు ప్రవీణ్, పూసుకూరి లింగస్వామి, మారగోని సురేష్, బాలు, శ్రీకాంత్, విన్ను, కృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>