కలం, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో పోలీసులు రూ.54 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు గ్రామ సమీపంలో ఉన్న వేటుకూరి ల్యాబ్స్‌లో నిషేధిత మెఫెడ్రిన్ డ్రగ్స్ తయారీ చేసి నాగ్‌పూర్ తరలిస్తున్నట్లు యాదాద్రి పోలీసులు, రాచకొండ ఎస్వోటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టి.. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓఆర్ఆర్ వద్ద మరో వ్యక్తి అరెస్ట్..
మరో ఘటనలో.. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.2.05 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నరేంద్ర శ్రీనివాస్‌గా గుర్తించారు. స్నాప్ చాట్ ద్వారా పలువురికి డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇతడి వద్ద సుమారు పది మంది వరకు హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి.. స్నాప్ చాట్ ద్వారా అవసరమైన వారికి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, నరేంద్ర శ్రీనివాస్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు నమోదైనట్లు.. బెయిల్ మీద బయటకొచ్చి మళ్లీ అదే పనిచేస్తున్నాడని చెప్పారు.

