చేయూత భృతిపై బీడీ కార్మికుల గళం

కలం, నిర్మల్: అర్హులైన బీడీ కార్మికులందరికీ (Beedi Workers) ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయూత పథకం ద్వారా నెలకు రూ.4,016 జీవన భృతి అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద నెలకు రూ.4,016 జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని ఆరోపించారు. అర్హులైన బీడీ కార్మికుల నుంచి జీవన భృతి కోసం దరఖాస్తులు స్వీకరించకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి బీడీ కార్మికుడికి ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ల  సాధన కోసం ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాకు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజన్న పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, ఉపాధ్యక్షుడు రామలక్ష్మణ్, సహాయ కార్యదర్శి గంగన్న, కోశాధికారి ఎండి. గపూర్, జిల్లా నాయకురాలు లక్ష్మితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>