కేసీఆర్ కీలక సమీక్ష: మడికొండలో బీఆర్ఎస్ నేతల భేటీ!

కలం, వరంగల్ బ్యూరో : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) నల్లబెల్లి పర్యటన అనంతరం మడికొండకు చేరుకోనున్నారు. నల్లబెల్లిలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మడికొండలోనే కేసీఆర్‌ భోజనం చేయనున్నారు. అనంతరం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో సందడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>