కలం, హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లో జరుగుతున్న 243వ బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నీలో జూనియర్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. మూడు రౌండ్లు ముగిసే సమయానికి ఏడుగురు ఆటగాళ్లు మూడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. చేతన్ మాలే, జయేష్ చంద్ర, అద్వైత గాడిపల్లి, ఎం. శివరామ్, అనిష్ దేవల్కర్, సోహన్స్ లడిశెట్టి, సూర్య సాకేత్ మూడు పాయింట్లతో లీడ్‌లో ఉన్నారు. రుద్ర తేజ, హర్ష్‌కుమార్ జైస్వాల్, వరుణ్ చింతల 2.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మూడో రౌండ్లో చేతన్ మాలే, అద్వైత గాడిపల్లి, అనిష్ దేవల్కర్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.
రుద్ర తేజ, హర్ష్‌కుమార్ జైస్వాల్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. జయేష్ చంద్ర కూడా గెలుపు నమోదు చేశాడు. ఓపెన్ విభాగంలోనూ పోటీ హోరాహోరీగా సాగుతోంది. కె. పెరుమల్లు, శ్రీచరణ్ తేజ్, కోవిష్ కుశాల్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ రెడ్డి, తరుణ్ సాయి తోట మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్.ఎస్. సౌరవ్, అథర్వ 2.5 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఓపెన్ మూడో రౌండ్లో కె. పెరుమల్లు, శ్రీచరణ్ తేజ్, కోవిష్ కుశాల్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్ రెడ్డి, తరుణ్ సాయి తోట విజయాలు సాధించారు. టోర్నీ దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో జరుగుతోంది.

