కలం, వెబ్ డెస్క్ : శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్సై పట్ల దారుణంగా ప్రవర్తించిన కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్(Chintada Ravi Kumar)ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా పరారీలో ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన ఆయన, తాను శ్రీకాకుళంలోనే ఉన్నానని తన అనుచరులపై కేసులు ఎత్తివేస్తే లొంగిపోతానని పోలీసులకు ఆఫర్లు ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జంక్షన్ సమీపంలో డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు చింతాడ రవికుమార్ వెళ్తుండగా పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. జగన్ పర్యటనలో ఎస్‌ఐ ప్రవళ్లికతో రవికుమార్ అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలోనే అతను గత 9 రోజులుగా పరారీలో ఉన్నారు.

