వనపర్తి టు మంత్రాలయం.. ఆర్టీసీ స్పెషల్ బస్సు

కలం, వనపర్తి: అమావాస్యను పురస్కరించుకుని మంత్రాలయం పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనానికి వనపర్తి (Wanaparthy) జిల్లా నుంచి భారీగా తరలి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక డీలక్స్ బస్సును నడపనున్నట్లు డిపో మేనేజర్ ఎం.దేవేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 12న (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరి పంచముఖి ఆంజనేయ స్వామి, మంత్రాలయం దర్శనం అనంతరం మరుసటి రోజు ఉదయం వనపర్తికి తిరిగి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణ ఛార్జీ ఒక్కొక్కరికి రూ.600గా నిర్ణయించినట్లు తెలిపారు. బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌ లేదా 7382829151, 7382829379 నెంబర్లకు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>