జూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం

కలం, జోగులాంబ గద్వాల: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు శనివారం వరద భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.73 లక్షల క్యూసెక్కులు ఇన్ ప్లో వస్తోంది. ప్రాజెక్టు 21 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 1,38,495 క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 29,525 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిప్టుకు 630 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిప్టుకు 547 క్యూసెక్కులు, భీమా లిఫ్టుకు 1300 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.01టీఎంసీలు ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>