జ‌న‌సేన‌తో పొత్తుపై టీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్య‌లు

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పొత్తుల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామచంద‌ర్‌రావు (Ramchander Rao) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఏ ఎన్నిక‌ల్లో కూడా ఇత‌ర‌ పార్టీల‌తో పొత్తులు పెట్టుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని వెల్ల‌డించారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా ఒంట‌రిగానే బ‌రిల నిలుస్తామ‌న్నారు.

ఇక జ‌న‌సేన‌తో పొత్తుపైనా రామ‌చంద‌ర్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ జాతీయ పార్టీ అని, జ‌న‌సేన ఎన్డీఏలో భాగం కాబ‌ట్టి త‌మ పార్టీ అధిష్టానం దానిపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అన్నారు. త‌మ‌కు మాత్రం తెలంగాణ‌లో ఎవ‌రితో పొత్తు పెట్టుకునే ఆలోచ‌న లేద‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ ల‌క్ష్య‌మ‌ని రామ‌చంద‌ర్ రావు తెలిపారు.

Also Read : పంత్ కోరికకు ఉత్తరాఖండ్​ సీఎం గ్రీన్ సిగ్నల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>