చెరువుల పనులకు టెండర్లు

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ నగరంలోని చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. హైడ్రా (HYDRAA) చేపట్టనున్న ఈ పనులకు జాతీయ స్థాయి టెండర్లు పిలవడానికి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అనుభవం, సాంకేతిక నైపుణ్యం ఉన్న సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కలిగింది. ప్రభుత్వం జూలై 13న చెరువుల పునరుద్ధరణ, సమగ్ర అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఆ పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టి త్వరగా పూర్తి చేయాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలో చెరువుల పునరుద్ధరణ పనులు సాధారణ సివిల్ పనులు కావని వివరించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, నాణ్యమైన పనులతోపాటు విస్తృత స్థాయిలో పోటీ ఉండేలా జాతీయ స్థాయి టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>