తెలంగాణ యూత్ అథ్లెటిక్స్‌లో కరీంనగర్ విద్యార్థికి బంగారు పతకం

కలం, కరీంనగర్ బ్యూరో: హనుమకొండలోని ప్రసిద్ధ జవహర్‌లాల్ నెహ్రూ (JN) స్టేడియం వేదికగా అత్యంత ఉత్సాహంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 12వ యూత్ (U18) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని నురైన్ అద్భుత ప్రతిభ కనబరిచింది.

ఈ టోర్నమెంట్‌లో భాగంగా నిర్వహించిన 12 ఏళ్ల లోపు బాలికల విభాగం 60 మీటర్ల జావెలిన్ త్రో పోటీల్లో పాల్గొని నురైన్ గోల్డ్ మెడల్ సాధించింది. 48 మంది పాల్గొన్న ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సారంగపాణి చిన్నారిని అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>