కలం, జోగులాంబ గద్వాల: ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు మంగళసూత్రాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన గద్వాల (Gadwal) రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గద్వాల మున్సిపాలిటి పరిధిలోని జమ్మిచేడులో గల 4, 5 వార్డులకు చెందిన కుర్వ రమాదేవి, బుచ్చమ్మ అనే ఇద్దరు మహిళలు తమ ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నారు. బుధవారం రాత్రి దుండగులు కుర్వ రమాదేవి మెడలో నుంచి 2.5 తులాల మంగళసూత్రం(గోల్డ్ చైన్), బుచ్చమ్మ మెడలో నుంచి అరతులం గల పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు.
బాధితులు వెంటనే గద్వాల రూరల్ పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గద్వాల సీఐ టి.శ్రీను ఆదేశాల మేరకు పోలీసులు గద్వాల ఆర్టీసి బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గద్వాల రైల్వే స్టేషన్ వద్ద ఒక అనుమానితుడ్ని విచారించగా ఆ చోరికీ తానే పాల్పడినట్లు పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. కాగ చోరీ కేసును గంటల వ్యవధిలో నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకుని నుంచి మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవడంతో గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ ను, పోలీస్ సిబ్బందిని పట్టణ ప్రజలు అభినందించారు. కాగ ఎంత మంది దుండగులు ఈ చోరీకీ పాల్పడారు అనేది తెలియాల్సి ఉంది.

