నిర్మల్‌‌లో ఘనంగా టీయూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కలం, నిర్మల్: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) ఆవిర్భావ దినోత్సవ (TUTF Foundation Day) వేడుకలను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, స్వర్గీయ స్వామిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు తోడిశెట్టి రవికాంత్ సంఘ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీయూటీఎఫ్ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాధ్యక్షులు ఏ లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వట్టోలి ముత్తన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి వహీద్ ఖాన్, కోశాధికారి మేడారపు శ్రీనివాస్, ఖానాపూర్, సారంగాపూర్ మండలాల అధ్యక్షులు పాండురంగాచారి, మొయిజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>