కలం, యాదాద్రి భువనగిరి: భద్రాచలం ఎమ్మెల్యే(Bhadrachalam MLA) తెల్లం వెంకట్రావుకు (Tellam Venkata Rao) తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు గురువారం చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ సమీపంలో ఓ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు భద్రతా సిబ్బందికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ప్రమాదం అనంతరం పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, అదే కారులో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భద్రాచలం బయలుదేరి వెళ్లిపోయారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తుండగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

