కలం, నిర్మల్: దిలావర్‌పూర్ (Dilawarpur) మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అష్టలక్ష్మి రైస్ మిల్‌ని వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామస్తులు గురువారం డీఎల్‌పీఓకి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని జాతీయ రహదారి నుంచి కదిలి వైపు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని, సర్వే నంబర్ 212లో రైస్‌మిల్ నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలతోపాటు హనుమాన్, మార్కండేయ ఆలయాలున్నాయని తెలిపారు.
ఈ ప్రాంతంలో రైస్‌మిల్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు, భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్, కాలుష్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైస్‌మిల్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి తొలగించాలని గ్రామస్తులు కోరారు.

