జయశంకర్ ఆశయాలకు విద్యే బాట: ఎంజీయూ వీసీ

కలం, ఎంజీయూ: తెలంగాణ జాతిపిత, ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధనకు విద్యనే ప్రధాన సాధనంగా మలుచుకోవాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (MGU Vice Chancellor) ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Althaf Hussain)  పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉన్నత విద్యాసంస్థలు నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధికి కేంద్రాలుగా మారాలని, వికేంద్రీకరణ ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికీ అందేలా మానవాభివృద్ధి ఆధారిత ప్రణాళికలు రూపొందించడమే జయశంకర్ సార్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఆచార్య జయశంకర్ నిరంతర అధ్యయనం, చర్చలు, విశ్లేషణల ద్వారా తెలంగాణ ఉద్యమానికి బలమైన వ్యూహాన్ని రూపొందించి విజయవంతంగా ముందుకు నడిపారని వీసీ పేర్కొన్నారు. అదే స్ఫూర్తి నేటి పాలనా వ్యవస్థకు కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. నిబద్ధత, దక్షత, ప్రజల పట్ల అంకితభావంతో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ప్రజలలో చైతన్య జ్యోతిని వెలిగించిన జయశంకర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీదేవి, డాక్టర్ అరుణ ప్రియ, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై. ప్రశాంతి, ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ మోహన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ ప్రభ, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ పనస రామకృష్ణ, వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>