కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం జోన్న రైతులకు రూ.994 కోట్లు జమచేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswar Rao) 1.01 లక్షల మంది రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బులు నమోదు చేసినట్లు తెలిపారు.
జోన్న కొనగోళ్లలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎంఎస్పీతో రికార్డు స్థాయిలో జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతు పండించిన ప్రతిగింజకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు వెల్లడించారు
అలాగే, కేంద్ర తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫెర్టిలైజర్స్ (FFS) అమలును దశల వారీగా విస్తరిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. ఎరువుల విక్రయాల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఆధార్ తో ఎరువులను కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎరువుల కొనుగోళ్లలో బ్లాక్ మార్కెట్ ను FFS నిలువరిస్తుందని తెలిపారు. మరోవైపు ఆయిల్ పామ్ సాగు విస్తరణపై అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.

