కరీంనగర్‌లో బీసీ సంఘం బస్సు యాత్ర ప్రారంభం

కలం, కరీంనగర్: బెంగళూరు సిటీ యూనివర్సిటీలో ఆగస్టు 7న జాతీయ ఓబీసీ 11వ మహాసభ జరగబోతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ (Karimnagar) నుంచి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో సభ్యులు బస్సు యాత్ర చేపట్టారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పురమళ్ల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఓబీసీల ఐక్యత, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న జాతీయ ఓబీసీ మహాసభలు అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నారు.

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా..

జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బి.పి.మండల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మహాసభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. “మేమెంతో – మాకంత” అనే నినాదంతో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఓబీసీల అభ్యున్నతికి సంబంధించిన కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురమళ్ల శ్రీనివాస్ పటేల్, కోడూరు పరుశురాం గౌడ్, జి.ఎస్. ఆనంద్, మాచర్ల అంజయ్య గౌడ్, మంథని కిరణ్, ఎడ్ల సురేందర్, నారోజు రాకేష్, మాదాసు సంజీవ్, పెంట శ్రీనివాస్, పురుషోత్తం ఆశిష్ గౌడ్, దేవరకొండ సంతోషిని, జోలాపురం శ్రావణి, వరలక్ష్మి వీరగోని తదితరులు మహాసభలో పాల్గొనేందుకు బెంగళూరుకు వెళ్లారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>