కొడంగల్ కాంగ్రెస్: కొత్త అధ్యక్షుల నియామకం!

కలం, నారాయణ పేట : కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు రెండు టౌన్ లకు కలిపి మొత్తం ఆరుగురి కి కాంగ్రెస్ పార్టీ (Kodangal Congress) మండల, పట్టణ బాధ్యతలను అప్పగిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ జారీ చేసినట్లు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే. ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోస్గి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రఘువర్ధన్ రెడ్డి, మద్దూరు మండల అధ్యక్షులుగా వంచర్ల బాలయ్య, గుండుమల్ మండల అధ్యక్షులుగా విక్రమ్ రెడ్డి సుంకి రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, కోస్గి పట్టణ అధ్యక్షులుగా రాములు బెయుజి, మద్దూర్ టౌన్ అధ్యక్షులుగా జెడ్డి వెంకటరాములను నియమించామన్నారు. ఇప్పటికే నారాయణపేట జిల్లాలోని పలు మండలాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించినట్లు తెలిపారు.

నూతనంగా బాధ్యతలు తీసుకోనున్న అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందించేందుకు కృషిచేసి పార్టీ పటిష్టత కోసం పాటుపడాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకోబోయే ప్రతిష్టాత్మక కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేసి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>