మెటాకు కేంద్ర ప్రభుత్వం మరోసారి వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: భారత్‌లో యాప్స్ నిర్వహించుకుంటూ అమెరికా చట్టాలు ఫాలో అవుతామంటే కుదరదని కేంద్ర ప్రభుత్వం మెటాకు (Meta) మరోసారి వార్నింగ్ ఇచ్చింది. కచ్చితంగా తమ చట్టాల ప్రకారమే నడుచుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. టెలిగ్రామ్, ఎక్స్ సహా మెటా నిర్వహిస్తున్న వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు ఐటీ చట్టాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. “సంబంధిత సంస్థల పట్ల యాప్స్ నిర్వహకులు బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్లాట్‌ఫారాలతో మేం నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నాం. కొన్ని అంశాల్లో ఇంకా చర్చలు జరగాల్సి ఉంది” అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇక్కడ ఉండాలని సూచన..

ప్రధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్‌లో తాత్కాలికంగా నిలిపివేయడంపై నిన్న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి మెటా గ్లోబల్ ప్రతినిధులు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెటా ప్రతినిధులను మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలుస్తోంది. మరో మూడు నాలుగు సమావేశాలు నిర్వహించాల్సి ఉందని.. వాట్సాప్ యాప్‌తో ముడిపడి ఉన్న కొన్ని సమస్యలను కూడా సమీక్షించాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటన్నింటి ఉద్దేశం.. మెటా సహా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం అయినా భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పడమే అని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>