కలం, నిర్మల్: విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ రమణ (Nirmal Police) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ మోసాలు, ఆన్లైన్ గేమింగ్ వల్ల కలిగే నష్టాలు, సోషల్ మీడియా భద్రత, సైబర్ వేధింపులు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరంపై వివరించారు.
తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలను క్లిక్ చేయొద్దని సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

