కలం, మహబూబ్నగర్ బ్యూరో: ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ డి.జానకి (SP Janaki) విద్యార్థులకు సూచించారు. మహబూబ్నగర్ (Mahabubnagar) పట్టణంలోని బండమీదిపల్లిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన నవోదయ ఫౌండేషన్ డే వేడుకలకు జిల్లా ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, దేశానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత వంటి విలువలను అలవరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని, కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎస్పీ డి.జానకి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాల గురించి తెలుసుకున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారిని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

