కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వీడియో తొలగింపుపై మెటా ఎట్టకేలకు దిగివచ్చింది. వీడియో తొలగింపుపై సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) మోదీకి క్షమాపణలు తెలియజేశారు. ఫ్లాట్ ఫామ్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లు జరగడం వల్లే వీడియో తొలగించినట్లు స్పష్టం చేశారు. తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్లు కూడా మెటా అంగీకరించింది. అలాగే, CSAM, డీప్ ఫేక్ కంటెంట్ పై జుకర్బర్గ్ విచారణ వ్యక్తం చేశారు.
కాగా, నీట్ పేపర్ లీక్ వివాదంతో చెలరేగుతున్న నిరసనల మధ్య ప్రధాని మోదీ సోషల్ మీడియాలో విద్యార్థులను ఉద్దేశిస్తూ విడియో విడుదల చేశారు. అయితే, తరువాత ఆ వీడియోను మెటా తొలగించింది. దీంతో వీడియో బ్లాక్ కావడంపై ద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కేంద్రమంత్రిత్వశాఖ మెటా, ఇన్స్టాగ్రామ్ హెడ్లకు సమన్లు జారీ చేసింది.
ఈ ఘటనపై బాధ్యుతలు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంట్ కమిటీ స్పష్టం చేసింది. కమిటీ ఆదేశాలు నిర్లక్ష్యం చేస్తే సేఫ్ హర్భర్ రక్షణను పున:సమీక్షించే అవకాశం ఉందని అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెటా అధినేత మార్క్ జుకర్ ప్రధాని మోదీ విడియో తొలగింపుపై బహిరంగ క్షమాపణలు చెప్పారు.

