నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయెల్

క‌లం, వెబ్‌డెస్క్‌: ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపైకి లక్ష వాహనాలు వస్తున్నాయని, దీని వల్ల రోడ్డు ప్రమాదంలో బాధితులకు ఎలాంటి సహాయం అందడం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. దీని కట్టడికి ‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేసేదానిపై ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

– దేశంలో సుమారు 30 కోట్ల వాహనాల్లో 16.54 కోట్ల (56శాతం) వెహికల్స్‌కు ఇన్సూరెన్స్ లేదని గతంలో పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది.
– రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం అందించేందుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కీలకమని.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని జీవించే హక్కుతో ముడిపడి ఉన్న అంశమని న్యాయస్థానం గుర్తుచేసింది.
– కొత్తగా కొనుగోలుచేసే కార్లకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు, బైక్‌ల‌కు ఐదేండ్ల నుంచి ఆరేండ్లకు పెంచాలని సుప్రీం ఆదేశించింది.
– ఇన్సూరెన్స్‌పై 2018లో తాము ఇచ్చిన ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో వెహికల్స్ ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లమీదికి వస్తున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
– వాహనానికి కరెక్ట్ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేసిన తర్వాతే బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసే వ్యవస్థ రావాలని.. అలా వస్తేనే ఇన్సూరెన్స్ మస్టుగా అమలవుతుందని, బాధితులకు సహాయం అందుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ కేసులో తీర్పు

తెలంగాణలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం.. మృతుడి కుటుంబానికి రూ.10,00,500 పరిహారంతో పాటు 7.5 శాతం వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సమగ్ర (కాంప్రిహెన్సివ్) మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానికీ వర్తిస్తుందని, ఇలాంటి కేసుల్లో అతిగా సాంకేతిక కారణాలు చూపరాదని తేల్చిచెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>