బడుగు బలహీనవర్గాల గొంతుక కవిత : గుంజపడుగు హరిప్రసాద్

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల గొంతుక తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మాత్రమేనని టీఆర్ఎస్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Hariprasad) అన్నారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రక్షణ సేన అసెంబ్లీ సమావేశం మంగళవారం నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

హాజరైన గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేయాలని కోరారు. సామాజిక న్యాయం పార్టీ నినాదం కాదు.. అది మా విధానం అని ప్రకటించిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు.

పాలకుల వివక్ష కారణంగా ఇప్పటికీ సమాజంలోని అనేక వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగులు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని కోరారు.

రిజర్వేషన్ల అమలులో, సంక్షేమ నిధుల పారదర్శక వినియోగించాడంలో, అణగారిన వర్గాల ప్రజల కోసం చట్టాలు సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తద్వారా సమాజం ఇప్పటికీ ఇల్లు లేని పేదలు, చదువు లేని వర్గాలు, కనీసం కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే పూర్తిగా పాలకుల వైఫల్యం అని విమర్శించారు. సమాజంలో వివక్షకు గురైన ప్రజల కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారని చెప్పారు.

పాంచజన్యంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగ పడే విధంగా సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అని రాజకీయ నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యాచరణను కవిత 6న సరూర్‌నగర్‌ ప్రకటించబోతున్నారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు, కవితమ్మ అభిమానులు పెద్దఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజ్, మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, నాయకులు కుతాడి శ్రీనివాస్, గాలి పెళ్లి రత్నాకర్, రంగరవేణి లక్ష్మణ్, యండి రాజీ, పూసల పవన్, గర్షకుర్తి విద్యాసాగర్, భాసవేణి రాజేందర్, ఎండి హుస్సేన్, ఉమార్, మడిపల్లి వినీత్, పూసాల రణధీర్ నూతి సాయిచరణ్, మహిళ విభాగం నాయకురాలు పిన్నింటి సంగీత రెడ్డి, జంగా అపర్ణ, కృష్ణవేణి, కొరిమి పద్మ, పల్లె శారద తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>