హుజూరాబాద్‌లో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి ముగ్గురు సర్పంచ్ లు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మండలానికి చెందిన సిరిసేడు సర్పంచ్ కుమార్–శ్యామల, వంతడువుల సర్పంచ్ రాజేష్–మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy), మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చేరిన సర్పంచ్‌లు మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో ఇప్పటికీ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శిస్తూ, బీజేపీ కూడా ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అందువల్ల పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Huzurabad MLA) ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందున ఆయన నాయకత్వంపై విశ్వాసంతోనే బీఆర్‌ఎస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తుంగ‌తుర్తి పంచాయితీపై జ‌గ్గారెడ్డి నివేదిక‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>