అడ‌వి పందుల అక్ర‌మ త‌ర‌లింపు.. పోలీసుల అదుపులో నిందితులు

క‌లం, నిర్మ‌ల్‌: అడవి పందులను అక్రమంగా తరలిస్తున్న (Wild Boar Smuggling) ఇద్దరు వ్యక్తులను నిర్మ‌ల్‌ (Nirmal) లో అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బాసర గోదావరి సమీపంలోని అటవీశాఖ చెక్‌ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సిద్ధిపేటకు బొలెరో వాహనంలో సుమారు 23 అడవి పందులను అక్రమంగా తరలిస్తుండగా, చెక్‌పోస్ట్ వద్ద వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా వాహనంలో ఉన్న అడవి పందులను గుర్తించి, వాటితో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం బైంసా (Bhainsa) అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు డిప్యూటీ రేంజ్ అధికారి శంకర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న అడవి పందులను (Wild Boar Smuggling) వైద్య పరీక్షల అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఫారెస్ట్ బీట్ అధికారులు శివ, సంజయ్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : తుంగ‌తుర్తి పంచాయితీపై జ‌గ్గారెడ్డి నివేదిక‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>