బకాయిలు అడిగితే అరెస్టులా?.. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఫైర్

కలం, వనపర్తి: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు (RTC Retired Employees) చెల్లించాల్సిన సుమారు రూ.900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముట్టడికి పిలుపునిస్తే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడిందని జిల్లా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సత్యం, కౌన్సిలర్ భారతి ప్రేమ్‌నాథ్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకు వచ్చిన వృద్ధ ఉద్యోగులను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వారు అన్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆర్‌బీఎస్, గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఒక్కో విశ్రాంత ఉద్యోగికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని, పిల్లల ఉన్నత విద్య, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును ఇవ్వాలని కోరుతున్నామే తప్ప మరేమీ కాదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తమ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారని, విశ్రాంత ఉద్యోగుల భవనం నిర్మాణానికి సహకరించడంతో పాటు తమకు అవసరమైన సమయంలో ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాకిటి శ్రీధర్, భారతి ప్రేమ్‌నాథ్ రెడ్డి అరెస్టుల సమయంలో తమకు అండగా నిలిచారని విశ్రాంత ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్, ప్రకాష్, సత్యనారాయణ గౌడ్, హుసేన్ అలీ, స్వామి, రాఘవరెడ్డి, బి.వి.రావు, గాంధీ, కురుమయ్య, రామ్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>