కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు (Nirmal Journalists) రాయితీతో కూడిన స్టేట్ బస్ పాస్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ (టీఎస్జేయూ) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు రాయితీ స్టేట్ బస్ పాస్ సౌకర్యం ఉండేదని, అయితే ఇటీవల నూతనంగా జారీ చేసిన అక్రిడేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్ పాస్ అందిస్తున్నారని తెలిపారు. ప్రతి నెల హైదరాబాద్ లో జరిగే అధికారిక సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించేందుకు వీలుగా రాయితీ స్టేట్ బస్ పాస్ మంజూరు చేయాలని కోరారు.
Also Read : భైంసా రైస్ మిల్లుల్లో అవినీతిపై బీజేపీ ఫిర్యాదు.. కలెక్టర్కు వినతి పత్రం
Follow Us On : WhatsApp

