అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్

కలం, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు పూర్తిస్థాయి భూమి హక్కులు కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి కరీంనగర్ (Karimnagar) జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ చేవెళ్ల డిక్లరేషన్ హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి తక్షణమే రూ.12 లక్షలు అందించాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి..

ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని బోయిని తిరుపతి కోరారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. పరిశ్రమల రుణాల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న దళితులకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ ను కోరారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, లంకదాసి కళ్యాణ్, ఇల్లందుల సురేందర్, యుగేందర్ ,మురళీ, నర్సింగ్, రాజు , కొమురన్న పాల్గొన్నారు.

Also Read : తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>