బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad)లో రాత్రి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప వర్షాల సమయంలో బయటకు వెళ్లొద్దని నగర వాసులకు సీపీ సజ్జనార్ సూచించారు. బయటకు వెళ్లినవారు వర్ష తీవ్రత పెరిగే లోపు ఇల్లు చేరేలా చూసుకోవాలన్నారు. నీరు నిలిచిపోయి, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి, జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లాలని వాహనదారులకు సూచించారు. కాగా, ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>