భారత జెండాతో జైస్మిన్.. ముగింపు వేడుకల్లో ప్రత్యేకం

కలం, స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకాన్ని బాక్సర్ జైస్మిన్ లాంబోరియా (Jaismine Lamboria) మోసే గౌరవం దక్కింది. గ్లాస్గో గేమ్స్‌లో మహిళల 57 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన ఆమెను భారత బృందం ఈ బాధ్యతకు ఎంపిక చేసింది. 24 ఏళ్ల జైస్మిన్ వరుస విజయాలతో భారత బాక్సింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచింది. గత ఏడాది లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది.

ఇప్పుడు గ్లాస్గోలో స్వర్ణ పతకంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు, ముగింపు వేడుకల్లో 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలను గ్లాస్గో నుంచి అహ్మదాబాద్‌కు అధికారికంగా అప్పగించనున్నారు. ఈ సందర్భంగా భారత సంస్కృతి, కామన్వెల్త్ దేశాలతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు భాగాలుగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>