రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే మేఘా రెడ్డి

కలం, వనపర్తి: వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy)ని కలిసి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ఆవరణలో విశ్రాంత ఉద్యోగులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ కుర్చీలను తొలగించారని, వాటిని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వినతిపై స్పందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసే అంశంలో అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పలువురు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>