బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక : ఎమ్మెల్యే కుంభం

కలం, బీబీనగర్ : బోనాల (Bonalu) పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రజల మధ్య ఐక్యతను, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar) అన్నారు. ఆదివారం బీబీనగర్ మండలంలోని నెమరుగోముల, జమిలాపేట, రాయరావుపేట గ్రామాల్లో ఘనంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని అమ్మవారి ఆలయాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే కుంభం (MLA Kumbam) మాట్లాడుతూ.. అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రైతులు, కార్మికులు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమంతో ముందుకు సాగాలని, గ్రామాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా నెమరుగోముల, జమిలాపేట, రాయరావుపేట గ్రామ ప్రజలు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఆప్యాయంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పొట్టోళ్ళ శ్యామ్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురకంటి సత్తిరెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్, మెట్టు శ్రీనివాస్ రెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, నెమరుగోముల సర్పంచ్ ఎర్రబోతు స్వర్ణలత–కృష్ణ, జమిలాపేట సర్పంచ్ బండారి మహేందర్, రాయరావుపేట సర్పంచ్ బొర్ర రమేష్, సింగిల్ విండో డైరెక్టర్లు రంగోళ్ళ శ్రీనివాస్, శివకుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>