ఫలాంబరి దేవిగా వ‌న‌దుర్గా భ‌వాని దర్శనం

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని (Edupayala Vanadurga Bhavani) ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆషాఢమాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

​ఫలాలతో విశేష అలంకరణ

​ఆషాఢ మాస పూజల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గా దేవిని రకరకాల తాజా పండ్లతో ‘ఫలాంబరి దేవి’ రూపంలో అత్యంత మనోహరంగా అలంకరించారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు.

Also Read : పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>