కలం, వెబ్డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నెలసరి ఆదాయంలో రికార్డు సృష్టించింది. జూలై నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం సమకూరింది. జూలైలో వేంకటేశ్వర స్వామికి రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జూలై నెలలో 24.52 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మరోవైపు ఆగస్ట్లోనూ టీటీడీకి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. నెల ప్రారంభంలో మొదటి రోజే 86,231 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32,017 మంది తలనీలాలు సమర్పించారు. శనివారం ఒక్క రోజే స్వామి వారికి రూ.3.74 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు ఆదివారం కూడా 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

