మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్!

కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి (Bellampalle) పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఏడుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా పాఠశాల సిబ్బంది ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.

సిబ్బంది నిర్లక్ష్యపూరిత తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని, తమ పిల్లలను చికిత్స నిమిత్తం సొంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>