కలం, జగిత్యాల: సహకార రంగం అభివృద్ధిలో బ్యాంకు అధికారులు, సంఘాల ప్రతినిధులు సమన్వయంతో సాగితే మెరుగైన సేవలు అందుతాయని జగిత్యాల (Jagtial) ప్యాక్స్ ఛైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జగిత్యాల బ్రాంచికి నూతన మేనేజర్‌గా మార్కండేయ, డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా వేణుగోపాల్ రావు నియమితులయ్యారు.
ఈ సందర్భంగా వారికి ప్యాక్స్ ఛైర్మన్ మహిపాల్ రెడ్డి స్వాగతం పలికి మాట్లాడారు. జగిత్యాల కేడీసీపీ బ్రాంచ్ పరిధిలో జగిత్యాల, కల్లెడ, సారంగాపూర్ సహకార సంఘాలు ఉన్నాయని వివరించారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు రైతులు, సహకార సంఘాల సభ్యుల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. సంఘాల కార్యదర్శులు గాజెంగి వేణు, జజాలా శేఖర్, లైశెట్టి శివకుమార్, సిబ్బంది రాజేష్, నవీన్, అజయ్, నారాయణ, గంగాధర్ పాల్గొన్నారు.

