కలం, హనుమకొండ : వరంగల్ కమిషనరేట్ మడికొండ (Madikonda) పోలీస్‌స్టేషన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తరాలపల్లికి చెందిన గంగాపురం స్వరూప నిర్వహిస్తున్న కిరాణా దుకాణంపై దాడులు నిర్వహించారు.
తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయానికి నిల్వ ఉంచిన వివిధ బ్రాండ్లకు చెందిన రూ.52,380 విలువైన మద్యం సీసాలు, బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు గంగాపురం స్వరూపను అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న మద్యం స్టాక్‌తో పాటు తదుపరి చట్టపరమైన చర్యల కోసం మడికొండ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఏసీపీ ఏ.మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్సై టి. వీరస్వామి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

