కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా రైతాంగానికి జీవనాడిగా ఉన్న కడెం, స్వర్ణ ప్రాజెక్టులను ( Kadem – Swarna Project ) రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్మల్ జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ జగన్ మోహన్ అన్నారు. శనివారం ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించి మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా ఈ రెండు ప్రాజెక్టుల్లో సమగ్ర పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నా, ప్రభుత్వం మాత్రం నిద్రమత్తులో ఉందని విమర్శించారు.
ప్రతి సంవత్సరం వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హడావుడిగా వచ్చి ఫోటోలు దిగడం, మీడియా ముందు గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు ఉపయోగపడే ఒక్క శాశ్వత పని కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వరదలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి, మిగతా రోజుల్లో ప్రాజెక్టులను ఎందుకు గాలికి వదిలేస్తున్నారని ప్రశ్నించారు. కడెం, స్వర్ణ ప్రాజెక్టుల్లో (Kadem Swarna Projects) వెంటనే సమగ్ర పూడికతీత చేపట్టాలని డిమాండ్ చేశారు.
Also Read : హేట్ స్పీచ్ బిల్లుపై ఎమ్మెల్యే కూనంనేని కీలక సూచనలు
Follow Us On : WhatsApp

