ఉపాధ్యాయుల మహాధర్నాలో నిర్మల్ జిల్లా తపస్ నాయకులు

కలం, నిర్మల్ : విద్యారంగం, ఉపాధ్యాయుల న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ లో నిర్వహించిన మహాధర్నాకు నిర్మల్ జిల్లా తపస్ నాయకులు, ఉపాధ్యాయులు (Nirmal Teachers) పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 317 జీవో బాధితులకు న్యాయం చేయడంతో పాటు పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ మహాధర్నాలో తపస్ నాయకులు శశిరాజ్, సుదర్శన్, జి. రాజేశ్వర్, ధీరజ్, జైశ్వాల్, విఠల్ రెడ్డి, పండరి, ఆర్. రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>