హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా (HYDRAA) చర్యలు అభినందనీయం అని కొనియాడారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకోవడంపై రేవంత్ ఎక్స్ వేదికగా స్పందించారు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న హైదరాబాద్‌ను చూడటం తనకు ఎంతగా సంతృప్తినిచ్చింది అని పేర్కొన్నారు.

హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ నగరంలోని చెరువులకు జీవం పోస్తూ… భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైడ్రా అంకితం చేస్తోందన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు, సిబ్బందికి సీఎం రేవంత్ (CM Revanth Reddy) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని.. భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం అని రాసుకొచ్చారు. ప్రతి చెరువును కాపాడుతూ… ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>