ప‌వ‌న్ భార్య దాతృత్వం.. బ‌ర్త్‌డే రోజు ఏం చేసిందంటే?

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల‌ (Anna Konidala) నేడు త‌న‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. విశాఖ‌ప‌ట్నంలోని ఇందిరా గాంధీ జూలాజిక‌ల్ పార్క్‌లో జంతువుల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. ఇందులో ఒక ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ టైగర్ ఉన్నాయి. అన్నా కొణిదెల‌ వీటిని ఏడాది పాటు ద‌త్త‌త తీసుకున్న‌ట్లు జూ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

అన్నా ఏనుగు కోసం రూ.4.30 లక్షలు, పులి కోసం రూ.2 లక్షలు విరాళం అంద‌జేశారు. మొత్తంగా రెండింటి కోసం రూ.6.30 లక్షలను అందించారు. ఈ డ‌బ్బును జూ అధికారులు వాటి పోషణ, సంరక్షణ, వైద్యం కోసం ఉప‌యోగించ‌నున్నారు. అన్నా కొణిదెల‌ సైతం త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ జంతువుల ద‌త్త‌త గురించి స్టోరీ పెట్టారు. జంతు ప్రేమికులు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అన్నాకు శుభాకాంక్ష‌లు చెప్ప‌డంతో పాటు, పుట్టిన రోజు సంద‌ర్భంగా తీసుకున్న నిర్ణ‌యాన్ని అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>