ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం: మహేశ్వర్ రెడ్డి

కలం, నిర్మల్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌ లోని ఇందిరాపార్కు వద్ద శనివారం నిర్వహించిన మహాధర్నాకు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించి పెండింగ్‌ లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా బలంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

Also Read : అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>